అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల్లో ఎలుగుబంట్ల దాడి ఘటనలు మనం చూశాం. కానీ ఉత్తరాఖండ్ లోని పౌఢీ-కోట్ ద్వారా జాతీయ రహదారికి సమీపంలోని ఆగ్రోడా కస్బా ప్రాంతంలో మాత్రం ఎలుగుబంట్లు మాంసాహార దుకాణాలపై దాడి చేస్తున్నాయి. అక్కడ కోళ్లు, చేపల్ని తినేస్తున్నాయి. ఆ తర్వాత దుకాణాలు ధ్వంసం చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాయి. దీంతో మాంసం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అటవీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa