పుట్టపర్తి మండలంలోని చెర్లోపల్లి అటవీ ప్రాంతంలో ఈ నెల 4న గొర్రెల కాపరి కేశప్ప భార్య నాగమ్మ హత్యకు గురైన కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు కొనసాగిన దర్యాప్తులో పోలీసులకు లభ్యమైన ఆధారాలను బట్టి స్థానిక ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఓ యువకుడు కామాంధుడని, ఒంటరిగా సంచరిస్తున్న మహిళలను, చివరకు వృద్ధురాళ్లపై సైతం అత్యాచారం చేసేవాడని స్థానికులు అంటున్నారు. సదరు యువకుడిపై పలు ఫిర్యాదు ఉన్నాయని, ఐదేళ్ల క్రితం చెర్లోపల్లి అటవీ ప్రాంతంలో ఓ వృద్ధురాలి హత్య కేసులోనూ నిందితుడనే వాదనలున్నాయి. నాగమ్మను కూడా అతనే హతమార్చి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరో రెండు రోజుల్లో ఈ కేసులో మిస్టరీని పోలీసులు బహిర్గతం చేయనున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa