కలుష్యం అంటే అందరికీ గుర్తించే నగరం ఢిల్లీ. కానీ కాలుష్య కొరల్లో చిక్కిన జాబితాలో ప్రస్తుతం ఢిల్లీయే కాదు.. ముంబై కూడా చేరింది. తాజా ఈ మహానగరం కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఇక్కడ గాలి నాణ్యత 300 పాయింట్ల తీవ్రస్థాయికి పడిపోయింది. వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. గురువారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 315 పాయింట్లు నమోదు అయింది. దీంతో ముంబై నగరవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. విధిగా మాస్క్‌లు ధరించాలని చెప్పారు.
ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవాళ్లు బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని, పిల్లలు తరచుగా మాస్క్‌లను మారుస్తుండాలని వైద్యులు తెలియజేశారు. ముఖ్యంగా ఆస్తమా ఉన్న పిల్లలు బయట ఆడుకునేటప్పుడు ఇన్‌హేలర్ అందుబాటులో పెట్టుకోవాలని వైద్య నిపుణులు చెప్పారు.
గాలిలో కాలుష్యం ఎక్కువగా ఉండడంతో ముంబైవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇది చలికాలం కావడంతో చాలామంది శ్వాస సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా జలుబు, దగ్గు నుంచి కొందరు కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. దాంతో ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఎన్ 95, కే 95 మాస్కులు ధరించాలని, గాలి నాణ్యత తక్కువ ఉన్నప్పుడు బయటకు రాకుండా ఉండడం మంచిదని చెబుతున్నారు.
ఇదిలావుంటే ఢిల్లీలో పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తుంది. దీంతో అక్కడ ఇప్పటికే వాహనాలపై నిషేధం కూడా విధించారు. అలాగే అక్కడి ప్రజలను కూడా జాగ్రత్తగా ఉండమని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు.