లండన్‌కు కొంచెం దూరంలో లూటన్‌లో కొత్తగా నిర్మించిన గురు నానక్ గురుద్వారాను ప్రిన్స్ ఛార్లెస్ సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ ప్రజల్లో మమేకమయ్యారు. ఈ సందర్భంగా కిచెన్ వాలంటీర్లను కలుసుకున్నారు. సిక్కు పాఠశాలను నిర్వహిస్తున్న వారిని కూడా కలుసుకున్నారు. అనంతరం పంజాబీ, సంప్రదాయ సంగీతం నేర్చుకుంటున్న విద్యార్థులతో మాట్లాడారు.
ప్రిన్స్ ఛార్లెస్‌కు... ఇతర మతాల పిల్లలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రిన్స్ ఛార్లెస్ అక్కడి పరిసరాలను పరిశీలించారు. భారతీయ సంప్రదాయ ప్రకారం నమస్తే పెట్టారు. నేలపై కూర్చున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. కాగా గురుద్వారాలోని వంట గదిలో ఏడాదిలో 365 రోజులు శాఖాహార భోజనాన్ని వేడి వేడిగా అందిస్తుంది.
కరోనా వైరస్ చెలరేగిన సమయంలో కూడా గురుద్వారా కోవిడ్ వ్యాక్సిన్ క్లినిక్‌ని కూడా నిర్వహించింది. యూకేలోనే ఇది మొదటిది. వ్యాక్సిన్లకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని నియంత్రించడం, కోవిడ్ టీకాలు వేసుకునేలా అవగాహన పెంచడంపై ఈ క్లినిక్ పని చేసింది.