బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారింది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం వద్ద శుక్రవారం అర్దరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. దీని వల్ల పుదుచ్చేరి, శ్రీహరికోట, దక్షిణ ఏపీ తీరం వెంట 65 కి.మీ నుంచి 85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, పుదుచ్చేరి, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు ఈ నెల 10 వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు:
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.13 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.19 గంటలకు కానుంది.
ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.18 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.29 గంటలకు కానుంది.
ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.22 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.38 గంటలకు కానుంది.
కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.31 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.45 గంటలకు కానుంది.
కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.25 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.44 గంటలకు కానుంది.
గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 గ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.22 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.35 గంటలకు నమోదు కానుంది.
కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.21 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.34 గంటలకు కానుంది.
విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.13 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.21 గంటలకు కానుంది.
చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.21 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.43 గంటలకు కానుంది.
అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.28 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.48 గంటలకు కానుంది.
నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.18 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.39 గంటలకు కానుంది.
శ్రీకాకుళం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.09 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.17 గంటలకు కానుంది.