ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బీసీ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి మోసపు కార్పొరేషన్లతో బీసీలకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కూర్చోవడానికి కుర్చీ, ఖర్చు చేయడానికి రూపాయి కూడా లేని కార్పొరేషన్లను బీసీల కిచ్చారని విమర్శించారు.