బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల పరిధిలోని పోతర్లంక గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని డిసెంబర్ 9 వ తేదీ శుక్రవారం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసి ప్రజాసమస్యలనడిగి తెలుసుకుంటారన్నారు. మండల స్థాయి అధికారులు, వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.