కాలంతో పని లేకుండా చాలా మంది డైలీ చన్నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. పలు అధ్యయనాల ప్రకారం, చలికాలంలో ముఖ్యంగా చన్నీళ్లతో స్నానం చేసినవారే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారట. చన్నీళ్లతో స్నానం చేసే సమయంలో రక్తనాళాలు కుంచించుకుపోయి ఒక్కసారిగా రక్తపోటు పెరుగుతుంది. తలపై చల్లటి నీరు పోసుకుంటే.. శరీరాన్ని నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్ మెదడులో వేగంగా విడుదలవుతుంది. ఇది రక్తపోటుకు కూడా కారణమవుతుంది. ఆపై బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్‌కు లోనవుతారు.