తమిళనాడులో మాంజస్ తుఫాను కారణంగా ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని డీజీపీ శైలేంద్రబాబు ఆదేశించారు. తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో బాధితులకు తక్షణ సాయం అందేలా పోలీసు శాఖను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. నేడు తుఫాను తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పలు జిల్లాలకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు పోలీసు శాఖకు చెందిన గజఈతగాళ్లు, కోస్తాతీర దళానికి చెందిన స్విమ్మర్లు 50మందితో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సిద్ధంగా ఉంచారు.