అమెరికా, రష్యాల ఖైదీల విడుదల ఒప్పందం కింద అమెరికన్ బాస్కెట్ బాల్ స్టార్ బ్రిట్నీ గ్రైనర్ ను రష్యా విడుదల చేసింది. దీనికి బదులుగా ఆయుధ వ్యాపారి విక్టర్ బౌట్ ను అమెరికా అప్పగించింది. రెండు సార్లు ఒలంపిక్స్ లో గొల్డ్ మెడల్ సాధించిన గ్రినర్, రష్యా ప్రీమియర్ లీగ్ కోసం ఫిబ్రవరిలో రష్యాకు వెళ్లగా, లగేజీలో హషిష్ ఆయిల్ దొరకడంతో అరెస్టు అయ్యింది. ఆపై డ్రగ్స్ ఆరోపణలకు ఆమెకు తొమ్మిదేళ్ల శిక్ష విధించారు. ఆమె అరెస్టుపై బైడెన్ సర్కారుపై ఒత్తిడి రావడంతో ఖైదీల పరస్పర విడుదలకు రష్యాతో బేరసారాలు ఆడింది. అబుదాబిలో గ్రినర్ ను అప్పగించి, విక్టర్ బౌట్ ను తీసుకువచ్చినట్లు రష్యా తెలిపింది.