తమిళనాడులోని తాంబరం సమీపంలో ఘోరం జరిగింది. మరమలైనగర్లో పట్టాలపై కూర్చొని మాట్లాడుకుంటున్న ఓ ప్రేమ జంట రైలు ఢీకొని మృతి చెందింది. కడలూరు జిల్లాకు చెందిన అలెక్స్ (24), షెర్లిన్ (20) ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. రెండు కుటుంబాల అనుమతితో వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి మరమలైనగర్ ప్రాంతంలో ఉన్న రైలుపట్టాలపై కూర్చొని మాటల్లోపడ్డారు. ఆ సమయంలో అటుగా వస్తున్న రైలును గమనించి తప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆలోపే రైలు వారిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. రైలు ఢీకొనడం వల్ల ప్రమాదవశాత్తు మరణించారా, లేకుంటే ఇద్దరి మధ్య విభేధాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.