ఈ శీతాకాలంలో చర్మం సులువుగా పొడిబారుతుంటుంది. ఈ సమయంలో జాగ్రత్త తప్పనిసరి. పొడి చర్మతత్వం ఉన్నవారు మొక్కల ఆధారిత నూనెలతో తయారుచేసిన గ్లిజరిన్ సోప్‌తో స్నానం ఉత్తమం. అలాగే నాణ్యమైన మాయిశ్చరైజర్లు వాడండి. స్నానం చేసిన తర్వాత కొద్దిగా మాయిశ్చరైజర్ శరీరంపై అప్లై చేయడం ద్వారా చర్మం తేమను కోల్పోదు. క్యారెట్, బీట్రూట్, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోండి. అంతేకాక తరచూ మంచి నీరు తాగడం ద్వారా చర్మం పొడి బారదు.