గుజరాత్ అసెంబ్లీలో ప్రజలు మరోసారి బీజేపీకే పట్టం కట్టారు. దీంతో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారం కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 182 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 156 స్థానాలను గెలుచుకుంది. నమోదైన మొత్తం ఓట్లలో 53 శాతానికి పైగా ఓట్లు బీజేపీకే పడటం గమనార్హం. అయితే, రాష్ట్రంలో నోటాకు కూడా భారీగా ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5,01,202 మంది ఓటర్లు నోటాకు ఓటేశారు. మొత్తం నమోదైన పోలింగ్ శాతంలో ఇది 1.5 శాతం. కాగా, 2012 ఎన్నికల్లో నోటాకు 5,51,594 ఓట్లు పడ్డాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి నోటాకు ఓట్ల శాతం కాస్త తగ్గింది.