డ్రగ్స్‌కు అడ్డాగా రాష్ట్రం మారడంపై సీఎం జగన్ సిగ్గుపడాలని రాష్ట్ర తెలుగుయువత ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం విమర్శించారు. విజయవాడ నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో బియ్యం నిల్వలతో, ఎగుమతులతో రాష్ట్రం నిండు అన్నపూర్ణగా ఉంటే, ఇప్పుడు జగన్ హయాంలో డ్రగ్స్ నిలయంగా మారడం విచారకరమన్నారు. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికలో రెండేళ్ల కాలంలో మిగిలిన రాష్ట్రాలకంటే ఏపీలోనే అ త్యధికంగా డ్రగ్స్ పట్టుబడినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. లోకేష్ హయాంలో పలు సాఫ్ట్‌వేర్ సంస్ధలు వస్తే ఇప్పుడు రోలెక్స్ జగన్‌రెడ్డి, సంతానం సాయిరెడ్డి కలిసి ఐటీ హబ్‌ను డ్రగ్ హబ్‌గా మార్చారన్నారు. అధికార ప్రతినిధి సజ్జ అజయ్ మాట్లాడుతూ విదేశాలలో పట్టుబడ్డ గంజాయి ఏపీ నుంచే సరఫరా అవుతుందని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారని, దీనిపై రాష్ట్ర పోలీసు అధికారులు దృష్టి సారించాలని కోరారు. తెలుగు యువత నేతలు కర్రి రాజేష్, గూడపాటి జగదీష్, విస్సంపల్లి విజయ్ పాల్గొన్నారు.