ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను అత్యంత దారుణంగా హతమార్చిన ఆఫ్తాబ్ ను ఉరి తీయాలని శ్రద్ధా తండ్రి వికాశ్ వాల్కర్ డిమాండ్ చేశారు. ఈ హత్యా ఘటనలో ఆఫ్తాబ్ ఫ్యామిలీ పాత్ర కూడా ఉండి ఉంటుందని, ఆ కోణంలోనూ విచారణ చేపట్టాలని అన్నారు. 18 ఏళ్లు దాటిన పిల్లలను కంట్రోల్ లో పెట్టాలని.. వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న తీరు పట్ల వికాశ్ సంతృప్తి వ్యక్తం చేశారు. వాసాయి పోలీసుల వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నానని, ఒక వేళ ఆ పోలీసులు సహాయం చేసి ఉంటే తన కూతురు ప్రాణాలతో ఉండేదని అన్నారు.