శరీర సామర్థ్యం కంటే ఎక్కువ డ్రింక్స్ తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ వస్తుంది. దీనివల్ల ఇతర పనులపై సరైన ఏకాగ్రత పెట్టలేరు. ఈ హ్యాంగోవర్ తగ్గడానికి చిన్న చిట్కాలు ట్రై చేయండి. పార్టీ మరుసటి రోజు మీరు నిద్రలేచిన తర్వాత అల్పాహారం తప్పని సరిగా తీసుకోండి. హ్యాంగోవర్‌ను తగ్గించడంలో అల్పాహారం సహాయపడుతుంది. అరటిపండు, పీనట్స్ బట్టర్ లాంటివి ఎంచుకోండి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, టీ లేదా కాఫీ, పెరుగు, అల్లం.. ఇవన్నీ హ్యాంగోవర్‌ను తగ్గించటంలో సహకరిస్తాయి. అలాగే హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి స్పోర్ట్స్ డ్రింక్స్ తాగవచ్చు. వాటిలో చాలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి.