హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నుంచి రాహుల్ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలనే పాఠాన్ని నేర్చుకోవాలని బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ ఎద్దేవా చేశారు. దీనికి లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ గట్టి కౌంటర్ ఇచ్చారు. 'గుజరాత్లో మోదీ గెలిచినా, ఉప ఎన్నికలు సహా దిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ఓడిపోయింది. గుజరాత్లో అభివృద్ధి చేశామని చెప్పుకున్నవారు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీ అంటే మోదీకి భయం' అని అధీర్ పేర్కొన్నారు.