ఢిల్లీ షాహదరా జిల్లాలోని జిల్ మిల్ ఇండస్ట్రీయల్ ప్రాంతంలోని ఓ పబ్లిక్ టాయిలెట్ లో మూడేళ్ల చిన్నారి మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడు జగ్గీ బస్తీకి చెందిన వాడిగా గుర్తించారు. బాలుణ్ని గొంతు నులిమి చంపినట్లు కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. మృతదేహం పక్కన దుస్తులు, బిస్కెట్లు, కొంత నగదు సైతం దొరికిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.