బంగాళాఖాతంలో ‘మండూస్’ తుపాను తీరం వైపు దూసుకొస్తోన్న నేపథ్యంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రేపు చెన్నై మహా నగరంలోని స్కూళ్లు, కాలేజీలు మూసేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశించింది. ప్రతికూల వాతావరణం కారణంగా చెన్నై ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తుపాను ప్రభావంతో చెన్నైలోని పార్కులు, ప్లే గ్రౌండ్లు సైతం మూతబడ్డాయి.