దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. దీంతో నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 389 పాయింట్లు నష్టపోయి 62,181 పాయింట్ల మార్కును తాకింది. నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 18,496 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : నెస్లే ఇండియా (2.24%), టైటాన్ (1.20%), సన్ ఫార్మా (1.20%), డాక్టర్ రెడ్డీస్ (1.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.88%).
టాప్ లూజర్స్ : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-6.72%), టెక్ మహీంద్రా (-3.58%), ఇన్ఫోసిస్ (-3.15%), విప్రో (-2.39%), టీసీఎస్ (-1.72%).