తెలుగుదేశం సీనియర్ నేత, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమ జగన్ రెడ్డి చేతగాని దద్దమ్మ కాబట్టి పోలవరం పూర్తి చేయలేమని చేతులెత్తేశారని విమర్శించారు. 72 శాతం పనులు చేసిన చంద్రబాబుకు ప్రాజెక్టును పూర్తి చేసే సత్తా, దమ్ము ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రైతాంగాన్ని అవినీతికి పాల్పడి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టిన ఘనుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. కేసీఆర్ చెప్పాడని, పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమైనప్పుడే జగన్ భాగోతం బయటపడిందని అన్నారు.