ఎండిన అంజీరాను ఎక్కువ సేపు నమిలితే నోట్లో లాలాజలం ఊరి జీర్ణశక్తి పెరుగుతుంది. ఇందులో పీచు, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. రాత్రంతా నీటిలో నానబెట్టిన అంజీరాను తేనెతో కలిపి పరగడపున తింటే జీర్ణశక్తిసహా ఆరోగ్యపరమైన ప్రయోజనాలెన్నో పొందొచ్చు. అంజీరాలో ఉండే కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంజీరా అధిక బరువుకు చెక్ పెడుతుంది. ఇవి గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.