ఇండోనేషియాలోని సుమత్రా ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌లు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మైనింగ్ సమయంలో పెద్ద మొత్తంలో మీథేన్ వాయువు వెలువడడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో మొత్తం 14 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. బ్లోయర్ల సాయంతో గని నుంచి మీథేన్‌ను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.