చలికాలంలో జలుబు, గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోవడం వంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాకరకాయ జలుబు మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది. కాకర రసానికి కొన్ని కాకరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, ఎండుమిర్చి, పసుపు, నల్ల ఉప్పు వేసి కలపాలి. ఈ జ్యూస్‌ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. దీన్ని ఉదయాన్నే తాగడం వల్ల పొట్ట పూర్తిగా శుభ్రపడుతుంది. రోజూ తీసుకుంటే రక్తాన్ని శుభ్రపరుస్తుంది. దీంతో చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.