ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు అత్యున్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టారు. తాజాగా సర్కారీ బడుల్లో సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. మొదటి దశలో 1,308 స్కూళ్లను గుర్తించి, అనుమతుల కోసం సీబీఎస్ఈ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ఈ బడుల్లో 8 తరగతి నుండి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వీటిలో జిల్లా పరిషత్ స్కూళ్లు 417, మున్సిపల్ స్కూళ్లు 71, గురుకుల విద్యా సంస్థలు 39, మోడల్ స్కూళ్లు 164, కస్తూర్భా గాంధీ స్కూళ్లు 352, సాంఘిక సంక్షేమ గురుకుల స్కూళ్లు 179, బీసీ గురుకుల స్కూళ్లు 26, గిరిజన గురుకుల స్కూళ్లు 45, ఆశ్రమ్ స్కూళ్లు 15 ఉన్నాయి.