వెల్లుల్లిలో యాంటీబయాటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. వెల్లుల్లి టీ తాగితే ఊబకాయాన్ని, మలబద్ధకం, అధిక బరువు సమస్యలను తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిలో విటమిన్ ఎ, బి1, బి2, సి ఉంటాయి. వెల్లుల్లి చర్మ సమస్యలను పోగొడుతుంది. వెల్లుల్లి టీ గుండె జబ్బులకు, అధిక రక్తపోటు, డయాబెటిస్ సమస్యకు చెక్ పెడుతుంది. వెల్లుల్లిలో ఉండే పోషకాలు శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. జలుబు, దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను పోగొడుతుంది. ఈ టీ ఉదర ఆరోగ్యాన్ని, జీర్ణశక్తి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒక కప్పు నీటిని మరిగించి, తరిగిన అల్లం, వెల్లుల్లిని అందులో వేసి కనీసం 15-20 నిమిషాల పాటు తక్కువ మంటలో మరిగించి, ఆ తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత దానిని ఫిల్టర్ చేసి, ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలిపితే వెల్లుల్లి టీ రెడీ అవుతుంది.