స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ కంటి నిండా విశ్రాంతి కరవైందనే చెప్పాలి. అయితే కొన్ని చిన్న చిన్న వ్యాయామాలతో కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెండు అరచేతులను రుద్దుకొని వేడెక్కిన తర్వాత ఆ చేతులను కళ్లపై కొన్ని సెకన్ల పాటు పెట్టుకోవాలి. రోజులో కొన్నిసార్లు కనుగుడ్లను అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి. కంప్యూటర్ ముందు ఎక్కువగా పని చేసే వారు కనీసం అరగంటకు ఓసారైనా చుట్టూ చూడాలి. కనురెప్పలను వేగంగా తెరుస్తూ, మూస్తూ ఉండడం కూడా వ్యాయామమేనని నిపుణులు చెబుతున్నారు.