రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇద్దరు బాలికల పట్ల దారుణంగా ప్రవర్తించింది ఓ మహిళ. మాల్వియా నగర్‌కు చెందిన వీణ అనే మహిళ బయట ఆడుకుంటున్న ఇద్దరు బాలికలను ఇంట్లోకి రమ్మని పిలిచింది. అనంతరం, గది తలుపులు వేసి ఇద్దరినీ కర్రతో కొట్టి చిన్నారుల ముఖాలపై వేడి నీళ్లు పోసింది. బాలికల కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడకు చేరుకుని రక్షించి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆ మహిళ నవ్వుతూనే ఉంది. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. ఆ బాలికలిద్దరూ ఇంటి ముందు ఆడుకుంటూ అరుస్తుండడంతో వీణ ఇలా చేసిందని స్థానికులు చెబుతున్నారు.