ఆహారంలో తల వెంట్రుక వచ్చిందని ఓ భర్త భార్యకు గుండు కొట్టించిన విచిత్ర ఘటన యూపీలో జరిగింది. పీలీభీత్ జిల్లా మిలాక్ గ్రామానికి చెందిన జహీరుద్దీన్, సీమాదేవికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. శుక్రవారం రాత్రి సీమాదేవి తన భర్తకు ఆహారం వడ్డించింది. అయితే ప్లేట్ లో తల వెంట్రుక వచ్చిందని కోపోద్రిక్తుడైన భర్త ఆమెకు గుండు కొట్టించాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితున్ని అరెస్ట్ చేశారు. అయితే, పెళ్లైనప్పటి నుంచి తనను అత్తింటివారు కట్నం కోసం వేధిస్తున్నారని సీమాదేవి ఆరోపించింది.