నాలుగు కంపెనీలు వచ్చేవారం ఐపీఓకి రానున్నాయి. సులా వైన్‌యార్డ్స్, అబన్స్ హోల్డింగ్స్, ల్యాండ్‌మార్క్ కార్స్, డ్రోన్‌ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ నాలుగు కలిపి రూ.1,860 కోట్లు సమీకరించనున్నాయి. అలాగే యూనిపార్ట్స్ ఇండియా షేర్లు కూడా వచ్చే వారంలోనే స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి. ల్యాండ్‌మార్క్ కార్స్ తమ ఐపీఓ ధరల శ్రేణిని రూ.481-506గా నిర్ణయించగా, అబన్స్ హోల్డింగ్స్ రూ.481-506గా నిర్ణయించారు. ఇక యూనిపార్ట్స్ ఇండియా రూ.548-577 ధరల శ్రేణి వద్ద ఐపీఓకి వచ్చిన విషయం తెలిసిందే.