మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం పరిష్కారానికి కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం హోంమంత్రి అమిత్ షా వచ్చే వారం భేటీ కానున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. వివాదంపై తమ ప్రభుత్వ వైఖరి, వాస్తవాలను అమిత్ షాకు ఫోన్ లో వివరించినట్లు బొమ్మై పేర్కొన్నారు. దీనిపై అఖిలపక్షం కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 14, లేదా 15 తేదీల్లో ఈ భేటీ ఉంటుందని బొమ్మై వివరించారు. మరోవైపు మహారాష్ట్రలో విపక్ష కూటమి మహా వికాస్ అగాడీ ఎంపీలు అమిత్ షాను కలిశారు.