భారత రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఎలక్ట్రిక్ రైలు ఇంజన్ల తయారీలో రికార్డు సృష్టించింది. 2021-22 లో భారత రైల్వే 490 ఇంజన్లను తయారుచేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికే 614 ఇంజన్లను రైల్వే తయారుచేసింది. రానున్న మూడు నెలల్లో ఈ సంఖ్య మరింత పెరగనుందని రైల్వే అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ ఏడాది దాదాపు 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రూ.1,08,593 కోట్లు ఆర్జించినట్లు అధికారులు తెలిపారు.