దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 13న ఉపరితల ఆవర్తనం ఆవిర్భవించనుంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 15న అల్పపీడనం ఏర్పడుతుందని, ఆ తర్వాత అల్పపీడనం బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో నేడు, రేపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.