కడప జిల్లా, మదనపల్లె పట్టణ సమీపంలోని చిప్పిలి గ్రామంలో అయ్యప్పస్వామి సేవాసంఘం ఆధ్వర్యంలో 2002 సెప్టెంబరు 28న కంచిపీఠాధుపతులు ఆశీర్వచనాలతో అయ్యప్ప స్వా మి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి ఎంతో మంది దాతల సాయంతో 2005 జూన్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తి అయింది. శబరిమలై నుంచి విచ్చేసిన మోహన తంత్రి శబరిమలైలో అయ్యప్పస్వామిని ప్రతిష్ఠ గావించిన ఆయన చేతులవీదుగా ఇక్కడ అయ్యప్పస్వామి వారిని ప్రతిష్ఠింపచేశారు. ఈ ఆలయం రెండవ శబరిమలగా పేరు గాంచిందని మోహనతంత్రి పేర్కొన్నారు. శబరిమలైలోని అయ్యప్ప విగ్రహాన్ని ఎక్కడ తయారు చేయించారో అక్కడే అంటే కుంబకోణం లో మదనపల్లె అయ్యప్పస్వామి విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించారని కమిటీ సభ్యులు తెలిపారు. కావున భక్తులు ఇక్కడ కూడా తమ మొక్కులు తీర్చుకోవచ్చని, అలానే సందర్శించవచ్చని తెలియజేసారు.