పౌష్టికాహారం తీసుకోవాలనుకునే చాలా మంది ప్రిపర్ చేసే ఫుడ్ కోడి గుడ్లు. కోడిగుడ్లను ఓ మోతాదులో మాత్రమే తినాలని, ఎక్కువుగా తినడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజూ ఒక ఉడక బెట్టిన గుడ్డును తింటే చాలు. పరిమితికి మించి తింటే మీరు డయేరియా బారిన పడొచ్చు. దీనివల్ల శరీరం బలహీనంగా తయారవుతుంది. అందుకే గుడ్లను అతిగా తినవద్దని సూచిస్తున్నారు. గుడ్లను మోతాదుకు మించి తింటే.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఇది మలబద్దకానికి దారితీస్తుంది.