ప్రస్తుత రోజుల్లో కొద్దిసేపు బయటికి పోతే చాలు. ఎండ, కాలుష్యం వల్ల ముఖంయ ట్యాన్ అయిపోతుంది. అయితే మన వంటింట్లోని టమాటతో ట్యాన్ ను పోగొట్టుకోవచ్చని మీకు తెలుసా? దీనికోసం ఒక తాజా టమాటని మధ్యలోకి కోసి, ఆ ముక్కని పంచదారలో అద్దాలి. దానిపై కొద్దిగా చిక్కని పెరుగు వేసి, దాంతో ముఖం రుద్దుకుంటే ముఖంపై పేరుకున్న నల్లదనం దూరమవుతుంది. అలాగే ఒక ముక్క టమట రసం, ఒక చెక్క నిమ్మరసం, కొద్దిగా పెరుగు కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై వారంలో రెండు సార్లు ప్యాక్ లా వేసుకుంటే ట్యాన్ తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది. మొటిమల సమస్యా తగ్గుతుంది.