ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల రాష్ట్ర విభజన పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అవకాశముంటే ఏపీ, తెలంగాణను కలపాలని, సమైఖ్య రాష్ట్రానికే తమ పార్టీ మద్దతు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కాగా, రాష్ట్ర విభజనపై సజ్జల మరోసారి స్పందించారు. రాష్ట్ర విభజన జరిగిన పద్ధతి సరిగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. సమైఖ్యరాష్ట్రం కోసం నిలబడ్డ ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ అని ఆయన స్పష్టం చేశారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.