ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ డెబిట్ కార్డు పోయిందా..నోటెన్షన్ ఇలా చేసి బ్లాక్ చేయండి

national |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 07:39 PM

మారుతున్న సమాజంలో అంతా కార్డుల రూపంలో బ్యాంకింగ్ సేవలు అందతున్నాయి. ఈ క్రమంలో కార్డుల వినియోగం పెరిగింది. అయితే మీరు వాడుతున్న డెబిట్ కార్డు పోయిందా? లేదా ఏదైనా దుర్వినియోగం జరిగిందా? కనీస మొత్తం నిల్వ ఉంచలేక ఛార్జీలు భరించలేకపోతున్నారా? అయితే ఆ కార్డును క్లోజ్ చేసేయడం ఉత్తమం. ఇప్పుడు ఎస్బీఐ డెబిట్ కార్డు లేదా ఏటీఎం కార్డు (ఎస్బీఐ డెబిట్ కార్డు) ఎలా బ్లాక్ చేయాలో చూద్దాం. ఇలా కార్డు పోయినా, ఏదైనా ఫ్రాడ్ జరిగినట్లు తెలిసినా.. తదుపరి లావాదేవీల్ని ఆపేందుకు కస్టమర్లు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే కార్డు లావాదేవీలు ఆగిపోతాయి. కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి కూడా వెంటనే తమ కార్డును బ్లాక్ చేయమని అడగొచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లడం లేదా ఇంటర్నె్ట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ పని చేయొచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.  ముందుగా బ్యాంక్ అకౌంట్‌తో మీ మొబైల్ నంబర్ అనుసంధానమై ఉండాలి.


మొబైల్ నంబర్, అకౌంట్ నంబర్ వాలిడ్ అయితే.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.


ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత.. మీ పేరుతో ఉన్న అకౌంట్లు మాస్క్‌డ్‌లో కనిపిస్తాయి.


మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కార్డు నంబర్‌పై క్లిక్ చేసుకోవచ్చు.


ఒక్కసారి.. కార్డు బ్లాక్ చేశాక, మళ్లీ ఆన్‌లైన్‌లో అన్‌బ్లాక్ చేయడం కుదరదు.


వెబ్‌సైట్ ద్వారా ఎస్బీఐ డెబిట్ కార్డును ఎలా బ్లాక్ చేయాలి?


https://retail.onlinesbi.sbi/retail/blockatmcard.htm వెబ్‌సైట్‌ను సందర్శించాలి.


అకౌంట్ నంబర్, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.


టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా ఎస్‌బీఐ డెబిట్ కార్డును బ్లాక్ చేయొచ్చు. ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్లు 1800 11 2211 లేదా 1800 425 3800 కు కాల్ చేయాలి. ఇది ఎస్‌బీఐ ఏటీఎం లేదా డెబిట్ కార్డును బ్లాక్ చేసేందుకు సులభమైన మార్గం. ఆ నంబర్లకు కాల్ చేసి.. వారి సూచనలకు అనుగుణంగా ఫాలో అయితే.. కార్డును బ్లాక్ చేసుకోవచ్చు.


ఎస్బీఐ డెబిట్ కార్డును ఎస్ఎంఎస్ సర్వీస్ ద్వారా కూడా బ్లాక్ చేయొచ్చు. ఇందుకోసం BLOCK XXXX. ఇక్కడ XXXX అంటే డెబిట్ కార్డు నంబర్ చివరి 4 అంకెలు. దీనిని 567676 నంబర్‌కు SMS చేయాల్సి ఉంటుంది. ఇది మీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్‌తోనే చేయాలి.


డెబిట్ కార్డును బ్లాక్ చేయాలంటే.. సంబంధిత లేదా దగ్గర్లోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి రిక్వెస్ట్ పెట్టుకోవడం ద్వారా కూడా చేసుకోవచ్చు.  ప్రస్తుత రోజుల్లో చాలా మంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ డెబిట్ కార్డులు ఉంటున్నాయి. ఉద్యోగం మారిన సమయంలో కొత్త అకౌంట్ తెరవాల్సి రావడం, లోన్ల కోసం కొత్త కార్డులు తీసుకోవడం ఇందుకు కారణం కావొచ్చు. అయితే.. ప్రతి అకౌంట్లోనూ మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. లేనిచో బ్యాంకులు ఛార్జీలను విధిస్తుంటాయి. ఇలాంటి సందర్భంలోనూ నిరుపయోగంగా ఉన్న బ్యాంక్ ఖాతాల్ని, బ్యాంక్ డెబిట్ కార్డుల్ని బ్లాక్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. అందుకోసం ఎస్బీఐ కస్టమర్లు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వొచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com