భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం నుంచి రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్ట్ మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 14 నుంచి 18 వరకు తొలి టెస్ట్ మ్యాచ్, ఈ నెల 22 నుంచి 26 వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
భారత జట్టు: కేఎల్ రాహుల్ (c), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా (vc), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (wk), కెఎస్ భరత్ (wk), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్