నంద్యాల జిల్లాలోని పగిడ్యాల మండలం లక్ష్మపురం గ్రామంలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రియురాలు మోసం చేసిందంటూ యువకుడు ఆంజనేయులు (25) పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రియురాలు నమ్మించి మోసం చేసిందని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆత్మహత్యకు ముందు యువకుడు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.