ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయోపరిమితిని ఐదేళ్లు పెంచాలని డీవైఎ్‌ఫఐ, ఏఐఎ్‌ఫఐ అధ్వర్యంలో సోమవారం విజయవాడ ధర్నాచౌక్‌లో తలపెట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ధర్నాకు అనుమతి లేదంటూ ధర్నాచౌక్ వద్దకు వ స్తున్న సంఘాల నాయకులను, నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్లకు తరలించారు. ధర్నాచౌక్‌లో నిరసన తెలిపే హక్కు లేదా? అని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. డీవైఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, జి.రామన్న మాట్లాడుతూ.... శాంతియుతంగా నిరసన తెలిపి, డీజీపీకి వినతిపత్రం ఇవ్వాలనుకున్న నిరుద్యోగులను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకుంటూ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.