చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం సహజం. అయితే గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే పర్వాలేదు కానీ.. బాగా వేడి నీటితో స్నానం చేస్తే చర్మంలోని తేమ శాతం తగ్గి పొడిబారిపోతుందట. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు స్కిన్ స్పెషలిస్టులు. అతి వేడి వల్ల మంచి బ్యాక్టీరియా నశించడమే ఇందుకు కారణం. హెయిర్ ఫాల్, చర్మంపై ముడతలు, దద్దుర్లు, రక్త ప్రసరణ వేగం తగ్గడం వంటి నష్టాలుంటాయని డాక్టర్లు చెప్తున్నారు.