ఢిల్లీలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. ఓ వ్యాపారవేత్తను మిస్డ్ కాల్స్ తో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఎలాంటి ఓటీపీ, లింక్స్ పంపకుండా.. కేవలం మిస్డ్ కాల్ ఇచ్చి రూ.50 లక్షలు దోచేశారు. డిసెంబర్ 10న రాత్రి 7 గంటల నుంచి గంటన్నర వరకూ వరుసగా వ్యాపారి మొబైల్ కు ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే, కాసేపటికే తన అకౌంట్ నుంచి రూ.50 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీన్ని చూసిన వ్యాపారి ఆందోళనతో పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై పోలీసులు విచారించగా ఝార్ఖండ్ లోని జమ్తారాలో సూత్రధారులు ఉన్నట్లు గుర్తించారు. సిమ్ స్వాప్ టెక్నాలజీతో ఈ స్కాం జరిగినట్లు అనుమానిస్తున్నారు.