ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డీ)లపై వడ్డీ రేట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పెంచింది . కొన్ని ఎంపిక చేసిన పథకాలకు మాత్రమే పెంపు వర్తిస్తుంది. రూ.2 కోట్ల కన్నా తక్కువ విలువ ఉండే ఎఫ్డీలపై పెంచిన వడ్డీ రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. మెచ్యూర్ అవుతున్న డిపాజిట్లను రెన్యూ చేసుకున్నా, కొత్తగా ఎఫ్డీలు తీసుకున్నా తాజా వడ్డీ రేట్లు వరిస్తాయి. వడ్డీ రేట్ల పెంపుతో.. 7-45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీపై 3శాతం వడ్డీ లభిస్తోంది. 46-179 రోజుల మధ్య ఎఫ్డీపై 3.9శాతం, 180-210రోజుల మధ్య 5.25శాతం వడ్డీ లభిస్తోంది. 211 రోజుల నుంచి 1 ఏడాది వరకు ఉండే ఎఫ్డీలపై 5.75శాతం వడ్డీ రేటు వస్తోంది. 1-2ఏళ్ల మధ్యలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీపై 6.75శాతం, 2-3మూడేళ్ల వరకు అయితే 6.75శాతం, 3ఏళ్ల నుంచి 5ఏళ్ల వరకు- 5ఏళ్ల నుంచి 10ఏళ్ల వరకు అయితే 6.25శాతం వడ్డీ రేటు లభిస్తోంది.