డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక పంట పొలాలు నీటి ముంపుకు గురయ్యాయని మాజీ ఉపసభాపతి మంటలను బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం కోడూరు మండలంలోని పలు పంట పొలాలను పరిశీలించిన ఆయన పంట పొలాల్లో నీళ్లు బయటకు మళ్ళించేందుకు రైతులు మోటార్లను వినియోగించడం చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ పనులను సక్రమంగా చేయకపోవడం వల్ల పలుచోట్ల పంట పొలాలు నీటి ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైనేజీ పనులు చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువు టిడిపి నేతలు పాల్గొన్నారు.