అచ్చుతాపురం: మండలంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తున్నామని యలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటి కన్నబాబు అన్నారు. దోసురు సచివాలయం పరిధిలోగ్రామలు నెట్టివాని పాలెం, రావిపాలెం, మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మమేకం అయ్యారు. ఇంటింటికీ తిరిగి నవరత్నాల క్రింద అందుతున్న పథకాలు, లబ్ధిదారుల గురించి ఆరా తీశారు. గ్రామంలోని వృద్ధులను పలకరిస్తూ సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. అవినీతికి ఆస్కారం
లేకుండా పారదర్శక పాలన అందించడంలో దేశం లోనే మన రాష్ట్రం ముందంజలో ఉండటానికి సీఎం జగనే కారణమని కొనియాడారు. గ్రామ సచివాలయలు ద్వారా పనిలేకుండానే ప్రతి ఒక్కరికి అవసరమైన సేవలు అందుతున్నాయన్నారు. అలాంటి వలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్ష టీడీపీ, వారి అనుకూల పచ్చపత్రికలు ఆరోపణలు చేయడం వారి వ్యవస్థ లేని సమయంలో ఏ చిన్న పత్రానికైనా మండల, జిల్లా కేంద్రాలకు పరుగులు తీసిన ప్రతి ఒక్కరికీ 'సీఎం జగన్ మానసపుత్రిక వలంటీర్ వ్యవస్థ గొప్పతనం తెలుసన్నారు. గత ఎన్నికల్లోనే వీరికి ఆశీర్వదించి టీడీపీ, జనసేనలకు చావుదెబ్బ తగిలినా ఇంకా బుద్ధి "రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వారికి బుద్ధి వచ్చేలా మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దించి, సీఎంగా గెలిపించాలని అభ్యర్థించారు. కార్య క్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరి యోగక్షేమాలను కనుగొన్నారు. వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే వాటి పరిష్కారానికి సం బంధిత అధికారులను ఆదేశించార. మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు దేశంశెట్టి. శంకర్రావు, కో ఆప్షన్ జెడ్సీ సభ్యులు నర్మాల కుమార్, సర్పంచ్ మురళీ, ఎంపీపీ భర్త కోస బుజ్జి, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి పిన్నమరాజు వాసు తదితరులు పాల్గొన్నారు.