వర్షాకాలంలో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. సరైనా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు, చర్మ అలెర్జీలు, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ ఫీవర్ వంటి సమస్యలొస్తాయి. ఈ క్రమంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇంగువ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంగువలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి కడుపు సమస్యలు, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను షరిష్కరించడంలో సహాయపడతాయి.