మనలో చాయ్ కు చాలామంది అభిమానులు ఉంటారు. కానీ, చాయ్ కు సంబంధించిన చర్చ మన పార్లమెంటులో జరిగిందనే విషయం మీకు తెలుసా? చాయ్ ని నేషనల్ డ్రింక్ గా ప్రకటించాలని అస్సాం బీజేపీ ఎంపీ పవిత్ర మార్గరెటా పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని కోరారు. 'కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి నార్త్ ఈస్ట్ వరకు ప్రతి ఇంటి కిచెన్ లో చాయ్ లభిస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు చాయ్ తోనే తమ దినచర్యను ప్రారంభిస్తారు. అందుకే చాయ్ ను జాతీయ పానీయంగా ప్రకటించాలి' అని ఆయన కోరారు.