ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లోని సర్రేలో బీబీసీ సిరీస్ 'టాప్ గేర్' కోసం ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్లింటాఫ్ కు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతని గాయాలు ప్రాణాంతకం కాదని అధికారులు తెలిపారు. సర్రేలోని డన్స్‌ఫోల్డ్ పార్క్ ఏరోడ్రోమ్ లో మంచుతో నిండిన పరిస్థితులలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఫ్లింటాఫ్ ట్రాక్‌లో మామూలుగా డ్రైవింగ్ చేస్తున్నాడని, అధిక వేగంతో వెళ్లలేదని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఫ్లింటాఫ్ గాయపడడంతో షూటింగ్ ను ప్రస్తుతానికి వాయిదా వేశారు.