గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల తయారీ పై మూడు రోజులుగా చినగంజాం మండలంలో నిర్వహించిన శిక్షణా సమావేశాలు బుధవారంతో ముగిసాయి. ఈ నెల 12వ తేదీ నుండి మండలంలోని అన్ని పంచాయతీల అధికారులు, సిబ్బంది ప్రజా ప్రతినిధులకు చినగంజాం ఎండిఓ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు ఎలా తయారు చేయాలి, నిధులు ఏ విధంగా కేటాయించాలి తదితర అంశాలపై వారికి శిక్షణ ఇచ్చినట్లు ఎండిఓ విజయలక్ష్మి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa